![]() |
![]() |

'బొమ్మరిల్లు' సినిమాలో సిద్ధార్ధ్‌కి బ్రదర్‌గా నటించి ఆకట్టుకున్న శ్రీరామ్ బుల్లితెరపై ప్రస్తుతం బిజీగా మారిపోయారు. ప్రస్తుతం శ్రీరామ్ ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మిస్తున్న సీరియల్ 'ప్రేమ ఎంత మధురం'. ఏజ్ బార్ అయిన యువకుడు ఆర్యవర్ధన్‌కీ... తన కంటే చాలా చిన్నదైన అనురాధకీ మధ్య సాగే ప్రేమకథగా ఈ సీరియల్‌ని డిజైన్ చేశారు. గత కొన్ని వారాలుగా ఈ సీరియల్ విజయవంతంగా జీ తెలుగులో ప్రసారం అవుతోంది.
ఆర్యవర్థన్‌ని ప్రేమిస్తున్న అనురాధ తన తండ్రి సుబ్బు కారణంగా అతనికి దూరంగా వుండటానికి అంగీకరిస్తుంది. ఆర్య వర్ధన్ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన అనురాధ కొత్త ఉద్యోగం వెతుక్కుంటుంది. ఈ క్రమంలో అనురాధని ఆర్యవర్ధన్ నుంచి దూరం చేసిన మీరా కావాలనే ఆఫీసుకి రాకుండా ఆర్యవర్ధన్‌నే తన ఇంటికి వచ్చేలా చేస్తుంది. మీరా కోసం వచ్చిన ఆర్యవర్ధన్ ఆమె ఇంట్లో ఏం చూశాడు?
అనురాధను ప్రేమించే ఆర్య వర్థన్ అనూహ్యంగా మారిపోయి మీరాకు అండగా వుంటానని ఎందుకు మాటిచ్చాడు? తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్య వర్ధన్ దారి తప్పుతున్నాడా? అన్నది నేడు ఆసక్తికరంగా మారబోతోంది. బుల్లెతెర ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ జీ తెలుగులో ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తోంది.
![]() |
![]() |